Mahesh Babu: టాలీవుడ్‌లో మహేష్‌బాబు ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. తండ్రి మరణంతో మహేష్‌బాబు తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన తండ్రి పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అతడి అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు. తమ అభిమాన హీరోను ఇలా చూడటం తమ వల్ల కావడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయితే ఎట్టకేలకు మహేష్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. బుధవారం నాడు కృష్ణకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన నందమూరి బాలకృష్ణ.. మహేష్‌బాబును ఓదార్చారు. కాసేపు కుశల ప్రశ్నలు వేస్తూ సరదాగా మాట్లాడటంతో నిన్నటి నుంచి దు:ఖంలో ఉన్న మహేష్ నవ్వాడు. మహేష్‌తో పాటు అతడి కుమారుడు గౌతమ్ కూడా నవ్వుతూ కనిపించాడు.
Read Also: Telangana: కోడలు అకాల మరణం.. తట్టుకోలేక గుండెపోటుతో వృద్ధుడు మృతి
దీంతో బాలయ్యకు మహేష్ అభిమానులు థ్యాంక్స్ చెప్తున్నారు. కష్ట సమయంలో మహేష్ ముఖంలో నవ్వు తెప్పించారని.. థాంక్స్ బాలయ్యా అంటూ మహేష్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అటు సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు సీఎం జగన్ పద్మాలయ స్టూడియోస్‌కు వెళ్లగా అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మహేష్‌బాబు కుటుంబసభ్యులతో జగన్ మాట్లాడుతుండగా.. అప్పుడే బాలకృష్ణ వచ్చారు. సీఎంను చూసి బాలయ్య తల ఊపగానే.. జగన్ నమస్కారం పెట్టారు. చిరునవ్వుతో దూరం నుంచే పలకరించుకున్నారు. అంతకముందు మహేష్ బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను కూడా సీఎం జగన్ పలకరించారు.