టాప్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారన్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రసారమయ్యే పెద్ద యాడ్లలో చాలా వరకు మన రాకుమారుడే హంగామా చేస్తుంటాడు. అందుకే పెద్ద బ్రాండ్‌లను ఎండార్స్ చేయడంలో మహేష్ బాబు టాప్ స్టార్. తాజాగా మరో ఖరీదైన యాడ్ మహేష్ బాబు ఖాతాలో పడింది. మహేష్ అత్యంత ఖరీదైన కారు ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఆడి తాజా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రమోట్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : Salaar : కీలక అప్డేట్ రివీల్ చేసిన ‘కేజీఎఫ్-2’ డైలాగ్ రైటర్
కాగా ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే “సర్కారు వారి పాట” నుంచి విడుదలైన రెండు పాటలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. “సర్కారు వారి పాట” మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dynamic, inside and out. The future is electric and we welcome @urstrulyMahesh to the #AudiExperience. #FutureIsAnAttitude #etronInIndia pic.twitter.com/Lu8UT3Ivcv
— Audi India (@AudiIN) April 16, 2022
