NTV Telugu Site icon

Mahesh Babu: గుంటూరు కారం మహేష్ కి చివరి తెలుగు సినిమా? సంచలన వ్యాఖ్యలు వైరల్!

Guntur Kaaram Trailer

Guntur Kaaram Trailer

Mahesh Babu says May Be Guntur Kaaram Was Last Regional Film for Scope Of Dance: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే మంచి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపెడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. యాంకర్ సుమ మహేష్ బాబు, శ్రీ లీల ఇద్దరినీ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు డాన్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమ మాట్లాడుతూ డాన్స్ గురించి ఈ సినిమాలో విడిగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సినిమాలో డాన్సులు చించి ఇరగ తీసేసారు. అసలు చాలా బాగా చేశారు అని ప్రశంసించారు.

Thangalaan :తంగలాన్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

దానికి మహేష్ బాబు మాట్లాడుతూ ముందు నుంచి నేను త్రివిక్రమ్ ఒకటే అనుకున్నాం. రెండు పాటలకు డాన్స్ మాత్రం ఒక రేంజ్ లో చేయాలి అనేది ముందు నుంచి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే దీని తర్వాత ఎప్పుడు రెగ్యులర్ గా తెలుగు సినిమా పాటలు చేస్తామో తెలియదు. ఇది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వచ్చు అని అంటూనే మళ్ళీ జాగ్రత్తపడి ఈ డాన్స్ ల విషయంలో చేయగలిగిన చివరి తెలుగు సినిమా ఇదే అవ్వచ్చు అని ఆయన కవర్ చేశారు. దానికి సుమ మాట్లాడుతూ మళ్లీ మీరు మూడేళ్ల తర్వాతేనా నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అనిపిస్తోంది అంటే దానికి మహేష్ మాట్లాడుతూ అలా ఏమీ కాదు రెగ్యులర్ గా ఇలాంటి తెలుగు సినిమాలు మళ్లీ మళ్లీ వస్తాయో రావో తెలియదు. వచ్చినప్పుడు బాగా చేస్తే అభిమానులు కూడా ఆనందిస్తారు కదా అంటూ క్లోజ్ చేశాడు.