Site icon NTV Telugu

Mahesh Babu : గోల్డెన్ హార్ట్… 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో, మరోవైపు దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఒకేరోజు ఏకంగా 30 మంది చిన్నారుల జీవితాల్లో వ్ వెలుగు నింపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌, మహేష్ బాబు ఫౌండేషన్‌ వైద్యుల సహకారంతో 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు.

Read Also : The Ghost : మ్యాజికల్… లొకేషన్ పిక్ షేర్ చేసిన డైరెక్టర్

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ మంచి పనికి సపోర్ట్ ను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దాతృత్వ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా నమ్రత పంచుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు ఆయన గోల్డెన్ హార్ట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Mb

Mb1

Mb2

Exit mobile version