Site icon NTV Telugu

Mahesh Babu: పాట మినహా పూర్తయిన ‘సర్కారు వారి పాట’

Mahesh Babu

Mahesh Babu

ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకో శుభవార్త! అతి త్వరలోనే మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేశ్ బాబు సరసన తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ చూడని మహేశ్ ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడు పరశురామ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి.

పాన్ ఇండియా మూవీస్ తో పాటు భారీ బడ్జెట్ తెలుగు సినిమాలూ విడుదలకు క్యూ కట్టడంతో ‘సర్కారు వారి పాట’ రిలీజ్ విషయంలో మరో ఆలోచన లేదని నిర్మాతలు చెప్పేశారు. ముందు అనుకున్నట్టే ఈ మూవీ మే 12న జనం ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ ప‌తాకాల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్. మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక మీదట సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కంటిన్యూగా ఇస్తామని చిత్ర నిర్మాతలు ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు.

Exit mobile version