Site icon NTV Telugu

“సర్కారు వారి పాట”లో కీర్తి రోల్ రివీల్ చేసిన మహేష్

Mahesh Babu reveals Keerthy Suresh’s role in SVP

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. నిన్న మహేష్ బాబు బర్త్ డే సర్ప్రైజ్ గా “సర్కారు వారి పాట” నుంచి రిలీజ్ చేసిన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన టీజర్లో మహేష్, కీర్తి సురేష్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ రిఫ్రెష్‌గా కన్పించింది. మహేష్, కీర్తి జంటగా నటించడం ఇదే మొదటిసారి. అయితే మహేష్ బాబు ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రను రివీల్ చేసేశాడు.

Read Also : ఆర్ఆర్ఆర్ : నెక్స్ట్ లెవెల్లో సెకండ్ సింగిల్

ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కేటీఆర్, ఇతర ప్రముఖులు అందరూ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరిలాగే కీర్తి సురేష్ కూడా ఆయనను విష్ చేసింది. “మీరు తెరపై మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా స్ఫూర్తి! అద్భుతమైన సహనటుడు, అందమైన వ్యక్తి. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సర్” అని కీర్తి ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కు రిప్లై ఇచ్చిన మహేష్ ధన్యవాదాలు ‘కళావతి’ అని అన్నారు. ఇంకేముంది “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్ “కళావతి” అనే పాత్రను పోషిస్తుందని మహేష్ స్వయంగా వెల్లడించినట్టు అయ్యింది.

Exit mobile version