Site icon NTV Telugu

SS Thaman: ‘కుర్చీ మడత’ పెట్టాడని ‘థమన్’ని ఎన్ని తిట్టుకున్నారో పాపం!

Ss Thaman Kurchi Madatha Petti

Ss Thaman Kurchi Madatha Petti

Mahesh Babu Revealed the facts behind Kurchi Madatha Petti Song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేశ్- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన మేకర్స్ నాలుగో పాటను రిలీజ్ చేశారు. అయితే కుర్చీ మడతపెట్టి సాంగ్ గురించి ఆ పాత ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. గతంలో సోషల్ మీడియాలో ఒక ముసలాయన ఉపయోగించిన కుర్చీ మడత పెట్టి అనే బూతులతో కూడిన డైలాగ్ తో రకరకాల డీజే మిక్స్ లు వచ్చాయి. ఇప్పుడు అదే డైలాగ్ ను మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా సాంగ్ లో పెట్టడం పెద్ద హాట్ టాపిక్ అయింది.

 
 అసలు మహేష్ కి ఇలాంటి సాంగ్ పెట్టడం ఏంటి? అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై, త్రివిక్రమ్ పై ఫ్యాన్స్, నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అయితే ఈ పాటలో కుర్చీ మడత పెట్టి డైలాగ్ యూజ్ చేసినందుకు ఆ ముసలాయనకు థమన్ స్వయంగా డబ్బులు కూడా ఇచ్చాడని తేలడంతో ఈ పాట ఐడియా తమన్ దే అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే హీరో మహేశ్ బాబు ఈ సాంగ్ గురించి కోసం మాట్లాడుతూ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఐడియా.. తమన్ ది కాదని తనది, త్రివికమ్ దని చెప్పుకొచ్చాడు. “ఈ సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి చేస్తావా అని నేను, త్రివిక్రమ్ గారు అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు. వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు. థమన్ అలా చేయలేదు. రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయి” అని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక అలా మహేష్ క్లారిటీ అవ్వడంతో పాపం థమన్ ను ఎన్ని తిట్టుకున్నార్రా మహేష్ ఫాన్స్ అని అంటున్నారు నెటిజన్లు. 

Exit mobile version