NTV Telugu Site icon

SSMB 29: ట్రిప్ కంప్లీట్ అయ్యింది… బాబు ల్యాండ్ అయ్యాడు

Ssmb 29

Ssmb 29

గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ వినిపించినా కూడా మహేష్ బాబు తన చెరిష్మాతో గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గరికి తీసుకోని వచ్చాడు. యావరేజ్ టాక్ తో 250 కోట్లు కొల్లగొట్టిన మహేష్ బాబు… రివ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు. సంక్రాంతి సీజన్ అవ్వగానే మహేష్ బాబు… ఓవర్సీస్ కి వెళ్ళిపోయాడు. మహేష్ బాబు ట్రిప్ కి వెళ్లాడని అంతా అనుకునే లోపు… ఇది రెగ్యులర్ ట్రిప్ కాదు రాజమౌళి సినిమా కోసం మహేష్ వేసిన ట్రిప్ అనే విషయం బయటకి వచ్చేసింది. పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ గ్లోబల్ సినిమా చేయడానికి రాజమౌళి-మహేష్ బాబులు రెడీ అయ్యారు.

ఆఫ్రికన్ అడవుల్లో ఇండియన్ ఇండియానా జోన్స్ రేంజ్ సినిమాని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల సమయం తీసుకోనున్న ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే అత్యధిక బడ్జట్ తో రూపొందనుంది. వెయ్యి కోట్ల ఖర్చుని రాజమౌళి తెరపై చూపించబోతున్నాడని సమాచారం. ఇదే నిజమైతే రాజమౌళి-మహేష్ బాబు కలిసి చేసే సినిమా బిగ్గెస్ట్ అడ్వెంచర్ డ్రామా అయ్యే అవకాశం ఉంది. రాజమౌళి ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేయగా… మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం ఫారిన్ వెళ్లాడు. ట్రిప్ కంప్లీట్ చేసుకున్న మహేష్ బాబు హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. బాబు ల్యాండ్ అవ్వడంతో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన మహేష్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.