Site icon NTV Telugu

SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?

Ssmb

Ssmb

SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే నవంబర్ లోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడుతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇలాంటి టైమ్ లో అది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రఫ్ అనే మూవీ తీసిన CH సుబ్బారెడ్డి.. తన కొత్త మూవీకి వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నట్టు ప్రకటించాడు. అఫీషియల్ గా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు రాజమౌళికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

Read Also : Maniratnam : బాహుబలిపై మణిరత్నం షాకింగ్ కామెంట్స్

మరి రాజమౌళి వేరే టైటిల్ చూసుకుంటాడా.. లేదంటే ఇదే వారణాసి టైటిల్ కు ఏదైనా హ్యాష్ ట్యాగ్ లాంటిది ఇచ్చి టైటిల్ లో మార్పులు చేస్తాడా అన్నది తెలియట్లేదు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా ముందు జాగ్రత్తతో ఉంటాడు. టైటిల్స్, రిలీజ్ డేట్స్, సీన్లు, డైలాగుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుంటాడు. అలాంటి జక్కన్నకు వారణాసి టైటిల్ విషయంలో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఒకవేళ సుబ్బారెడ్డి మూవీ టీమ్ కు డబ్బులు ఇచ్చి టైటిల్ కొనేస్తాడా అనే ప్రచారం కూడా ఉంది. కానీ నవంబర్ 15కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. తన స్టోరీకి తగ్గట్టు వేరే టైటిల్ ను కూడా ఆలోచించుకోవచ్చు. ఎంతైనా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంలో జక్కన్న దిట్ట. మరి ఏం చేస్తాడో చూడాలి.

Read Also : US Airstrikes Nigeria: క్రైస్తవ దేశంపై అమెరికా వైమానిక దాడులు.. ఇక వారికి చావే!

Exit mobile version