NTV Telugu Site icon

Mahesh Babu: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం..

Mahesh

Mahesh

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మృతి చెందింది. ఈ మధ్యకాలంలో కుక్కలను కూడా యజమానులు ఇంట్లో మనుషులుగా భావిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ కుక్కలను మరింత ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా వాటిని కూడా తీసుకెళ్తుంటారు. ఒకవేళ అవి కనుక మృతి చెందింతే.. తమ కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బాధపడతారు. తాజాగా సితార కూడా అలాంటి భాదనే అనుభవిస్తుంది. సితార పుట్టిన తరువాత మహేష్ ఇంట్లోకి ప్లూటో అనే కుక్కపిల్ల ఎంటర్ అయ్యింది. ఇక సితార పెరిగేకొద్దీ దానితోనే ఆటలు ఆడుతూ కనిపించేది. సీతూ పాప ఎక్కడికి వెళ్లినా ప్లూటో పక్కన ఉండాల్సిందే. ఇక ఏడేళ్లు ఎంతో ఆరోగ్యంగా జీవించిన ప్లూటో తాజాగా మృతి చెందిందని సితార చెప్పుకొచ్చింది. ప్లూటో ఫోటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యింది.

” మేమందరం నిన్ను మిస్ అవుతున్నాం.. 7 ఏళ్లు మాతో ఉన్నావు.. నువ్వు బెస్ట్” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ పై నమ్రత రిప్లై ఇస్తూ.. ” అతను ఎప్పుడు మన గుండెల్లో, ప్రార్థనలో ఉంటాడు” అంటూ సీతారాను ఓదార్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక డాగ్ లవర్స్.. రిప్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Show comments