సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా క్రిస్మస్ కి ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడు. ఫ్యామిలీతో పాటు మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ వేస్తున్నాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కవర్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ రానున్నాడు. మహేశ్ తిరిగి రాగానే SSMB 28 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో పది రోజుల పాటు SSMB 28 మూవీ షూటింగ్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసిన తర్వాత చిత్ర యూనిట్ షెడ్యూల్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో షూటింగ్ ని వాయిదా వేశారు.
ఇటివలే ముంబైలో మళ్లీ ఈ సినిమా పనులు మొదలయ్యాయి. త్రివిక్రమ్, తమన్ లు ముంబై వెళ్లి మహేశ్ బాబుని కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి చర్చలు జరిపారు. ప్రీవర్క్స్ దాదాపు కంప్లీట్ అవ్వడంతో మహేశ్ ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకోని తిరిగి రావడమే ఆలస్యం SSMB 28ని స్టార్ట్ చెయ్యడానికి చిత్ర యూనిట్ అంతా రెడీగా ఉంది. త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్ లో SSMB 28 సినిమా మూడవది. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘అతడు’, ‘ఖలేజ’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో హిట్ అవ్వలేదు కానీ ఆ తర్వాత టీవీలో చూసిన ఆడియన్స్ ‘అతడు’, ‘ఖలేజ’ సినిమాలకి కల్ట్ స్టేటస్ ఇచ్చారు. మహేశ్ తో ఇప్పటివరకూ లేని థియేటర్ హిట్ ని, SSMB 28తో ఎలా అయినా సొంతం చేసుకోవాలని చూస్తున్న త్రివిక్రమ్, ఘట్టమనేని అభిమానులకి ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలి.
