NTV Telugu Site icon

Mahesh Babu: గౌతమ్ కి అన్నలా ఉన్నాడు…

Mahesh Babu

Mahesh Babu

ఎవరికైనా వయసు మీద పడే కొద్దీ అందం తగ్గుతుంది… ఈ మాట అందరికీ వర్తిస్తుందేమో కానీ మహేశ్ బాబుకి మాత్రం కాదేమో. 47 సంవత్సరాల మహేశ్ రోజురోజుకీ యంగ్ గా కనిపిస్తున్నాడు. డీఏజింగ్ టెక్నాలజీని ఇన్-బిల్ట్ తన డీఎన్ఏలో పెట్టుకున్నాడేమో కానీ వయసు పెరిగీ కొద్దీ మహేశ్ అందంగా కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా బయటకి వచ్చిన మహేశ్ ఫోటో చూస్తే, ఈ మాట నిజమని ఎవరైనా చెప్పాల్సిందే. మహేశ్, నమ్రత, గౌతమ్, సితారా ప్రస్తుతం స్విజ్జర్లాండ్ లో ఉన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ ఫ్యామిలీతో పాటు మహేశ్ బాబు స్విజ్జర్లాండ్ వెళ్లాడు. అక్కడి నుంచి మహేశ్ ఫ్యామిలీ ఫోటో బయటకి వచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫోటోలో బ్లూ హుడీ వేసుకోని, క్యాప్ పెట్టుకోని కనిపించాడు మహేశ్ బాబు, పక్కనే వైట్ టీ-షర్ట్ వేసుకోని గౌతమ్ నిలబడి ఉన్నాడు. ఈ ఫోటో చూసిన ఎవరైనా సరే మహేశ్ ని గౌతమ్ ని నాన్న అంటే నమ్మక పోవచ్చు, గౌతమ్ ని అన్న అనుకునే అంత యంగ్ గా మహేశ్ కనిపిస్తున్నాడు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో మహేశ్ బాబు హైదరాబాద్ తిరిగి రానున్నాడు. మహేశ్ తిరిగి రాగానే ‘SSMB 28’ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడు. మహేశ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ‘SSMB 28’, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఈపాటికే స్టార్ట్ అవ్వాల్సి ఉండగా సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో ‘SSMB 28’ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇటివలే ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ని త్రివిక్రమ్ తమన్ తో కలిసి పూర్తి చేశాడు. మరి అతడు, ఖలేజా సినిమాలతో బాకీ పడిన హిట్ ని ‘SSMB 28’తో మహేశ్, త్రివిక్రమ్ ని పూర్తి చేస్తారేమో చూడాలి.

Show comments