Mahesh Babu New Look: మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మూడు నెలలు దాటిపోతోంది. అయినా ఇప్పటివరకు మహేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలను లైనప్ చేశాడు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కావాలి. అయితే ఇటీవల టాలీవుడ్‌లో కొన్ని సమస్యల కారణంగా షూటింగ్‌లు బంద్ కావడంతో మహేష్ సినిమా పట్టాలెక్కలేదు. అటు సర్కారు వారి పాట సినిమా తర్వాత పూర్తిగా తన సమయాన్ని మహేష్‌బాబు ఫ్యామిలీకి కేటాయించాడు. ఈ మేరకు కుటుంబసభ్యులతో కలిసి వెకేషన్ కోసం ఫారిన్ కూడా వెళ్లొచ్చాడు. లండన్, యూరప్ వంటి దేశాలలో విహరించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి మహేష్ మేకోవర్ అవుతున్నాడు.
Read Also: Shocking Video: పాముపై కాలేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
ఈ నేపథ్యంలో మహేష్‌బాబు కొత్త స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో మహేష్ లైట్ గా గడ్డం,మీసకట్టుతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోతో #SSMB28 హాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. మహేష్ తన ట్విటర్ అకౌంట్‌లో ‘Loving the new vibe’ ట్యాగ్ లైన్‌తో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఆ ఫొటోను షేర్ చేస్తూ సూపర్‌స్టార్ అభిమానులు సందడి చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు,దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మహర్షి తర్వాత మహేష్-పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కబోయే రెండో మూవీ కానుంది.
Loving the new vibe… 😎@jatinkampani @AalimHakim #AnishaJain #NamrataShirodkar pic.twitter.com/g6MZ23DzcP
— Mahesh Babu (@urstrulyMahesh) August 14, 2022
