MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎలాంటి ప్రోగ్రామ్స్ కు కూడా రావట్లేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు వెళ్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పూర్తి గడ్డం, పొడవాటి జుట్టుతో ఇప్పటికే చాలా సార్లు కనిపించాడు. కానీ ఇన్ని రోజులు దూరం నుంచే మహేశ్ లుక్ కనిపించింది. అయితే తాజాగా మహేశ్ లుక్ ఫస్ట్ టైమ్ దగ్గరి నుంచి వచ్చేసింది. తాజాగా మహేశ్, నమ్రత కలిసి ఓ చోట కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇందులో మహేశ్ చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నాడు.
Read Also : Garuda 2.0: ఓటీటీలోకి వెంకీ మామ హీరోయిన్ కొత్త సినిమా
షాట్, టీషర్టు వేసుకున్న మహేశ్ ఈ సారి మరింత పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. ఆయన లుక్స్ ఇందులో అదిరిపోయాయి. ఇన్ని రోజులు ఫ్యాన్స్ ఏం కావాలని కోరుకున్నారో అది ఇందులో కనిపించేస్తోంది. ప్రస్తుతం ఈ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ ను ఇంత మాసివ్ లుక్ లో గతంలో ఎన్నడూ చూసి ఉండరు కాబోలు. ఎంతైనా జక్కన్న సినిమా అంటే అన్నీ మారిపోవాల్సిందే కదా. అందుకే ఇందులో మహేశ్ ఇంత రస్టిక్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని అడ్వెంచర్ స్టైల్ లో తీస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
