NTV Telugu Site icon

Mahesh Babu: మహేష్ సింప్లిసిటీ.. అంత పెద్ద ఈవెంట్ కు ఆ డ్రెస్ లో

Mahesh

Mahesh

Mahesh Babu: సాధారణంగా.. ఎవరైనా ఒక ఈవెంట్ కు వెళ్తున్నాం అంటే.. అందరు ఉంటారు.. డ్రెస్సింగ్ బావుండాలి.. మనమే హైలైట్ కావాలి అని అనుకుంటారు. ఇక స్టార్ హీరోస్ కూడా వేరే హీరోల ఫంక్షన్స్ కు, ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు డిజైనర్ డ్రెస్ లు వేసుకొని వెళ్తారు. ఇది అందరికీ తెల్సిందే. కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అందుకు విరుద్ధం. మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా.. లేకపోతే కుటుంబం. తన డిక్షనరీ లో ఈ రెండు తప్ప వేరే పేజీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక బయట ఈవెంట్స్ కు ఎప్పుడు వచ్చినా మహేష్ ఎప్పుడు సింపుల్ గానే కనిపిస్తాడు. నార్మల్ షర్ట్ లేదా టీ షర్ట్. అది ఎంత పెద్ద పార్టీ అయినా సరే.. ఏరోజు కూడా మహేష్ బయట ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు హెవీగా డిజైనర్ డ్రెస్ లతో వెళ్ళింది అంటే నమ్మి తీరాలి. ఇక ఈరోజు కూడా మహేష్ అదే సింప్లిసిటీని మెయింటైన్ చేశాడు.

Mahendragiri Varahi: సుమంత్ మరోసారి థ్రిల్లర్ తో వస్తున్నాడు..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. నేడు మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు కూడా మహేష్ ఎంతో సింపుల్ గా వచ్చాడు. ఒక సాధారణమైన టీ షర్ట్ వేసుకొని.. చాలా సింపుల్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ హీరోలు.. పెద్ద ఈవెంట్ అయినా కూడా తన యూనిక్ స్టైల్ తో ఇంత సింపుల్ గా వచ్చిన మహేష్ సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరి ఈ ఈవెంట్ లో మహేష్ ఏం మాట్లాడతాడో చూడాలి.

Show comments