NTV Telugu Site icon

Mahesh Babu: ఎవడ్రా హాలీవుడ్ హీరో.. మా సూపర్ స్టార్ ను చూడండి ఒక్కసారి..

Babu

Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 40 ఏళ్లు దాటినా కూడా పాతికేళ్ల హీరోలానే కనిపిస్తాడు. ఆ ఛార్మింగ్ అలాంటింది మరి. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు మహేష్. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. ఇక జక్కన్న సినిమా అంటే.. ఎప్పుడు అవుతుందో చెప్పనవసరం లేదు. అయితే జక్కన్న తో సినిమా అంటే.. మహేష్ ను మళ్లీ ఎప్పుడు చూస్తామో.. ఎప్పుడు కనిపిస్తాడో అని అభిమానులు ఆందోళన పడుతున్న విషయం తెల్సిందే. కానీ, మహేష్ మాత్రం.. అభిమానులకు అలాంటి ఆందోళన లేకుండా చేస్తున్నాడు. ఇండస్ట్రీ మొత్తంలో మహేష్ చేసిన యాడ్స్ ఇంకెవరు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ యాడ్స్ ద్వారానే మహేష్ ను ఫ్యాన్స్ చూస్తున్నారు. వీటితో పాటు ఈ మధ్య మహేష్ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో అదరగొడుతున్నాడు.

గత మూడురోజుల నుంచి రోజుకో ఫోటో షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. నిన్నటికి నిన్న బ్లాక్ సూట్, గాగుల్స్ తో కనిపించాడు. ఇక నేడు అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. చెక్స్ షర్ట్.. చెదిరిన జుట్టుతో ఎంతో అందంగా కనిపించాడు. నిజం చెప్పాలంటే హాలీవుడ్ హీరోలు ఏ మాత్రం పనికిరారు అనేట్టుగా ఉన్నాడు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఎవడ్రా హాలీవుడ్ హీరో.. మా సూపర్ స్టార్ ను చూడండి ఒక్కసారి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మహేష్.. ssmb 29 తో హాలీవుడ్ లో పాగా వేస్తాడేమో చూడాలి.

Show comments