సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మహేశ్ బాబు, ప్రస్తుతం జిమ్ లో కూర్చోని కండలు పెంచే పనిలో పడ్డాడు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లు ఉన్నాడు. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే మహేశ్ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మాత్రం సిక్స్ ప్యాక్ గ్యారెంటీ అనే ఫీలింగ్ రాకమానదు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేశ్ బాబు కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో చిన్న శాంపిల్ చూపిస్తూ ఈ జిమ్ ఫోటోలు బయటకి వచ్చాయి.
మహేశ్ ట్రైనర్ తీసిన ఈ ఫోటోల్లో మహేశ్ బాబు ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్, టోన్డ్ బాడీతో మహేశ్ బాబు మస్త్ ఉన్నాడు. అతడు, ఖలేజ సినిమాలతో ఘట్టమనేని అభిమానులకి హిట్ బాకీ ఉన్న త్రివిక్రమ్ ఈ సారి మాత్రం SSMB 28 సినిమాతో ఆ బాకీని వడ్డీతో సహా తీర్చేయ్యబోతున్నట్లు ఉన్నాడు. ఆగస్ట్ లో రిలీజ్ కానున్న ఈ మూవీలో మహేశ్ పక్కన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. SSMB 28 ప్రాజెక్ట్ అయిపోగానే మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవ్వనుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కూడా మహేశ్ బాబు ఫిజిక్ పెంచాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ నుంచి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవనున్నాయి.
Superstar #MaheshBabu Burning it up in Gym 🔥💪#SSMB28 Look 🦁 🙌@urstrulymahesh #FitnessGoals pic.twitter.com/fzfo99dXTF
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 2, 2023
