Site icon NTV Telugu

ఫ్యామిలీతో సూపర్ స్టార్ గోవా ట్రిప్… పిక్స్ వైరల్

Mahesh Babu is off to Goa for a family vacation

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బయల్దేరారు. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, వారి పిల్లలు, గౌతమ్, సితార గోవా వెళ్తున్నారు. మహేష్ కుటుంబంతో పాటు ఆయన స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు గోవాలో “సర్కారు వారి పాట” షూటింగ్ మొదలుపెట్టగా ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు బీచ్‌లలో సరదాగా గడుపుతారన్నమాట. ఆగస్ట్ 14న నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌ లో వారు చార్టర్డ్ ఫ్లైట్ లో బయల్దేరినట్టు వెల్లడించింది. ఫ్లైట్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసింది. అందులో మహేష్ బాబు, గౌతమ్, సితార, నమ్రతతో పాటు స్నేహితుడి కుటుంబం కూడా ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ లతో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల “సర్కారు వారి పాట” నిర్మాతలు మహేష్ బాబు స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్, లక్ష్మణ్‌తో సన్నివేశం గురించి చర్చించిన ఫోటోను పంచుకున్నారు.

Read Also : గల్లీ రౌడీ : “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్

కరోనా సెకండ్ వేవ్ తరువాత గత నెలలో మహేష్ బాబు హైదరాబాద్‌లో “సర్కారు వారి పాట” షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు షూటింగ్ చేసిన తరువాత మేకర్స్ ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లారు. యాక్షన్ బ్లాక్ షూటింగ్ కోసం అక్కడ భారీ సెట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Exit mobile version