NTV Telugu Site icon

Mahesh Babu: అన్నా.. ఇలా చేయడం నీకు కొంచమైనా న్యాయంగా అనిపిస్తుందా..?

Mahesh

Mahesh

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం SSMB28. హారిక అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల ఇంకో హీరోయిన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు SSMB28 సవ్యంగా జరిగిందే లేదు. వాయిదాల మీద వాయిదాహాలు.. గ్యాప్ ల మీద గ్యాప్ లు. ఇక ఈ మధ్యనే బాబు షూటింగ్ కు కంటిన్యూస్ షెడ్యూల్ ను ఫినిష్ చేసినట్లు టాక్. ఇదే విధంగా సినిమా చేసేసి.. త్వరగా పూర్తి చేస్తే.. రాజమౌళి సినిమాను పట్టాలెక్కిస్తారేమో అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ, అవేమి అయ్యే పనులుగా కనిపించడం లేదు. ఎందుకంటే మహేష్ బాబు మరోసారి షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లనున్నాడట.

NTR30: టాలీవుడ్ ఫ్యాన్స్ ను టెంప్ట్ చేసి ముందే బుట్టలో వేసుకుంటున్నావా .. జాన్వీ

రెండు మూడు వారాలు.. కుటుంబంతో కలిసి విదేశాల్లోనే మహేష్ ఉండనున్నాడట. ఈ విషయం తెలియడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఏం అన్నా.. మా మీద నీకు దయలేదా..? షూటింగ్ గ్యాప్ లో వెకేషన్ కు వెళ్ళు అన్నా.. కానీ, షూటింగ్ కే గ్యాప్ ఇచ్చి వెళితే.. ఈ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతోంది.. ఇంకో సినిమా ఇంకెప్పుడు మొదలుపెడతావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. అన్నా.. ఇలా చేయడం నీకు కొంచమైనా న్యాయంగా ఉందా..? ఇంకా ఎన్ని రోజులు ఇలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. పిల్లలకు వేసవి సెలవలు వచ్చేసాయి. అందుకే వారితో సమయం గడపడానికి బయల్దేరనున్నాడు మహేష్. మరి మహేష్ ఎప్పుడు తిరిగి వచ్చి ఈ సినిమాను కంప్లీట్ చేస్తాడో చూడాలి.

Show comments