NTV Telugu Site icon

Mahesh Babu: దైవం మానుష రూపేణ…

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు, సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. MB ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తూ ఉంటాడు. ఇప్పటివరకూ హార్ట్ ఇష్యూస్ తో క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఎన్నో చిన్న ప్రాణాలని కాపాడాడు మహేశ్ బాబు. అందుకే దైవం మానుష్య రూపేణా అనే విషయాన్ని మహేశ్ బాబుతో పోల్చి చెప్తూ ఉంటారు ఘట్టమనేని అభిమానులు. మహేశ్ ఫాన్స్ మాత్రమే కాదు మహేశ్ చేస్తున్న సాయానికి ప్రతి ఒక్కరినీ ఇన్స్పైర్ చేసేలా ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీకి ఒక చిన్న పాపా హార్ట్ ఇష్యూతో ఇబ్బంది పడుతుంది అనే విషయం తెలిసింది. అతను వెంటనే నమ్రతని అప్రోచ్ అవ్వడంతో, పేషంట్ డీటెయిల్స్ తెప్పించుకున్న నమ్రత… MB ఫౌండేషన్ కి పాపా వివరాలు పంపించి సర్జరీ అయ్యేలా చేసింది. ఇప్పుడు పాపా రికవర్ అవుతుంది అని తెలుసుకున్న నాగవంశీ, మహేశ్ బాబుకి నమ్రతకి థాంక్యూ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు. నాగ వంశీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి హీరోకి అభిమాని అయినందుకు ఘట్టమనేని అభిమానులు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read Also: Nabha Natesh: నభా.. నువ్వలా మత్తుగా చూస్తుంటే, గుండెల్లో పెరుగుతోంది దడ

Show comments