సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “మహర్షి” చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా అవార్డులు, ప్రశంసలు అందుకుంటూనే ఉంది. నిన్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో 2019 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు స్వయంగా అవార్డు అందుకున్నారు. “మహర్షి” మరో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకున్నాడు. 2019 లో విడుదలైన సినిమాలలో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అవార్డు అందుకున్నారు. “మహర్షి” డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది.
Read Also : అల సాక్షి అవార్డ్స్ లో…
ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
