Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా కూడా తనకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను చూడడమే కాకుండా.. వాటి రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏదైనా డిఫరెంట్ కథ నచ్చితే తప్పకుండా దాని గురించి మాట్లాడతాడు. తాజాగా మహేష్ మనసును కొల్లగొట్టింది మలయాళ వెబ్ సిరీస్ పోచర్. కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ను ఎంతో అద్భుతంగా ఈ సిరీస్ లో చూపించారు. నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ను ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా దర్శకత్వం వహించింది. ఇక బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ తెరకెక్కడంతో ఈ సిరీస్ పై అందరి కన్ను పడింది. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి అనే క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అవ్వడం, వారిని పట్టుకోవడానికి రేంజ్ ఆఫీసర్ టీమ్ ఏ విధంగా పోరాటం చేసింది అనేది కథ. దాదాపు 18 ఏనుగుల దారుణ హత్యలకు ప్రతీకారంగా ఆఫీసర్స్.. కరుడుగట్టిన ఏనుగుల పోచర్స్ ను ఎలా హతమార్చారు అనేది చూపించారు. ఇక ఈ సిరీస్ గురించి మహేష్ ట్వీట్ చేస్తూ.. ” ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో హ్యుమానిటీ ఉండదా..? ఈ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. మహేష్ ట్వీట్ తో ఈ సిరీస్ పై హైప్ మరింత పెరిగింది. మరి ముందు ముందు ఈ సిరీస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
