Site icon NTV Telugu

MB Foundation : మరో పసి హృదయాన్ని కాపాడిన డాక్టర్లు

Mb Foundation

Mb Foundation

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాల్లో రియల్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ అంటూ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. పలు చిల్డ్రన్ హాస్పిటల్స్ తో కలిసి చిన్నారుల ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడే చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రాణాలు పోస్తున్నారు మహేష్ బాబు. తాజాగా మరో బేబీ హృదయాన్ని కాపాడాము అంటూ మహేష్ బాబు ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతేకాదు ఆ బేబీ ఆరోగ్యంగా కోలుకోవడానికి కారణమైన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.

Read Also : Sonam Kapoor : బేబీ బంప్ తో స్టార్ హీరోయిన్ ఫోటోషూట్… పిక్స్ వైరల్

“ఏప్రిల్ 1 న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బేబీ ఇప్పుడు కోలుకుంది, బాగానే ఉంది. చిన్నారికి అత్యుత్తమ చికిత్స, సంరక్షణను అందించినందుకు #RainbowHospitals లోని నిపుణుల బృందానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. #MbforSavingHearts #MbFoundation @urstruly మహేష్” అంటూ మహేష్ బాబు ఫౌండేషన్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో మహేష్ గోల్డెన్ హార్ట్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన అభిమానులు. పాప పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కు, మహేష్ బాబుకు, వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో మే 12న ప్రేక్షకులను థియేటర్లలో పలరించనున్నారు మహేష్ బాబు.

Exit mobile version