Mahesh Babu Foundation Launches Superstar Krishna Educational Fund: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెగసి మొత్తాన్ని ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాలలో హీరోగా నటించి చాలా స్టార్ డం తెచ్చుకున్నారు. ఆయన తర్వాత తరంలో ముందుగా కుమారుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హీరోయిన్ మహేష్ బాబు మాత్రం తండ్రి తరహాలో పేరు తెచ్చుకుని ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయారు. ఒక పక్క మహేష్ బాబు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్నారు, అవి కాకుండా పలు వ్యాపారాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే తాను సంపాదించిన డబ్బులో సింహభాగం సమాజసేవకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి అనేకమంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Actor Bikshu : ఇలియానా బాగా ఇబ్బంది పెట్టేసింది.. ఏకంగా 9 నెలలు పాటు!
ఇప్పుడు తాజాగా తన తండ్రి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మహేష్ బాబు తన భార్యను అమృతతో కలిసి 2020లో మహేష్ బాబు ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 2500 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. ఇక తాజాగా తన తండ్రి మొదటి వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు ఒక ఎడ్యుకేషనల్ ఫండ్ ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల నుంచి ఎంపిక చేసిన 40 మంది పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకు వారి ప్రతిభను ఆధారంగా చేసుకుని ఈ స్కాలర్షిప్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. మహేష్ బాబు సేవాగుణం చూసి మిగతా హీరోలు కూడా సేవ చేసేందుకు ముందుకు రావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.