Mahesh Babu: నెల రోజుల్లో రిలీజ్ ఉంది స్పీడ్ పెంచండి… అప్డేట్ కోసం సోషల్ మీడియాలో ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఇటీవలే మహేష్ బాబు, మీనాక్షి చౌదరిలపై కొన్ని సీన్స్ అండ్ ఒక సాంగ్ షూట్ చేసారు చిత్ర యూనిట్. నెక్స్ట్ సాంగ్ ని కేరళలో మహేష్ బాబు అండ్ శ్రీలీలపై షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 25 వరకూ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తేనే గుంటూరు కారం సినిమా జనవరి 12న వాయిదా పడకుండా రిలీజ్ అవుతుంది. ఒకవేళ షూటింగ్ లో కాస్త డిలే జరిగినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరింత ఆలస్యం అయ్యి గుంటూరు కారం సినిమా విడుదల వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ తీసుకోకుండానే త్రివిక్రమ్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే గుంటూరు కారం అప్డేట్ కోసం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ధమ్ మసాలా సాంగ్ గుంటూరు కారం సినిమా నుంచి బయటకి వచ్చి నెల రోజులు అయ్యింది. ఈ సాంగ్ మంచి బజ్ జనరేట్ చేసింది కానీ నెక్స్ట్ సాంగ్ బయటకి రావడానికి మేకర్స్ చాలా టైం తీసుకున్నారు. మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకోని గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ ని లైట్ తీసుకున్నారు, సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చెయ్యలేదు అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ ఆందోళనని తగ్గించేలా గుంటూరు కారం సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేస్తారేమో చూద్దాం. ఇప్పటికైతే అలాంటి పరిణామాలు కనిపించట్లేదు మరి నాగ వంశీ అయినా సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చూసి రెస్పాండ్ అవుతాడేమో చూడాలి.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!