NTV Telugu Site icon

Mahesh Babu: కృష్ణ వర్థంతి.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్

Mahesh

Mahesh

Mahesh Babu: గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట జరిగిన విషాదాలు గురించి అందరికీ తెల్సిందే వరుసగా మహేష్.. అన్నను, తల్లిని, తండ్రిని పోగొట్టుకున్నాడు. గతేడాది నవంబర్ 15 న సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన విషయం తెల్సిందే. వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ .. చికిత్స తీసుకుంటూనే మృతి చెందారు. ఇక తండ్రి మరణంతో మహేష్ ఒంటరి వాడు అయిపోయాడు. కృష్ణ మృతికి కొన్ని నెలల క్రితమే తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక తల్లితండ్రి, అన్నను పోగొట్టుకొని మహేష్ ఎంతో విషాదంలో మునిగిపోయాడు. కృష్ణ మృతిచెంది నేటికీ ఏడాది అవుతుంది. దీంతో ఆయనను స్మరించుకుంటూ అభిమానులు, కుటుంబసభ్యులు, ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు.

Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

ఇక ఘట్టమనేని కుటుంబం ఆయనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ లో ఒక స్మారక దినం ఏర్పాటు చేశారు. తండ్రి కృష్ణకు మహేష్ నివాళులు అర్పించి.. తండ్రిని గుర్తుచేసుకున్నాడు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది అని ఎన్నోసార్లు మహేష్ చెప్పుకొచ్చాడు. తండ్రి ఫొటోకు నివాళులు అర్పిస్తూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు. ఇక మహేష్ తో పాటు ఘట్టమనేని కుటుంబం మొత్తం కృష్ణకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈక్రమంలోనే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.