Site icon NTV Telugu

Mahesh Babu: తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపిన సూపర్‌స్టార్

Mahesh Wishes His Father

Mahesh Wishes His Father

టాలీవుడ్ అలనాటి హీరో సూపర్‌స్టార్ కృష్ణ నేడు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నాన్న.. పుట్టినరోజు శుభాకాంక్షలు! నీలాగా మరెవ్వరూ లేరు. మరింత ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ భార్య నమ్రతా సైతం మామయ్యకు బర్త్ డే విషెస్ తెలిపింది. ‘‘కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మీరు నా జీవితంలో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. అందుకు నేనెప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్యా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో నమత్రా పోస్ట్ పెట్టింది.

కాగా.. 344 చిత్రాల్లో హీరోగా నటించి, ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన కృష్ణ పుట్టినరోజుని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. తొలి జేమ్స్‌బాండ్, తొలి కౌబాయ్, తొలి ఫుల్‌స్కోప్, తొలి 70ఎమ్ఎమ్ వంటి ఎన్నో తొలి అనుభూతుల్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఆయనది. హీరోగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌గా నిలిచిపోయారు.

Exit mobile version