NTV Telugu Site icon

Mahesh Babu: చిన్న సినిమాకి పెద్ద సపోర్ట్… ఒక్క ట్వీట్ తో జాతకం మార్చేశాడు

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టాలెంట్ ని, చిన్న సినిమాలని ఎంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఏ సినిమా నచ్చినా వెంటనే ట్వీట్ చేసో, పర్సనల్ గా పిలిపించో అభినందించడం మహేష్ బాబు నైజం. తన సినిమానా? లేక వేరే వాళ్ల సినిమానా అనేది చూడకుండా మహేష్ అప్రిసియేషన్ ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. అలా మహేష్ మనసు గెలుచుకుంది లేటెస్ట్ మూవీ ‘మేమ్ ఫేమస్’. మేజర్, రైటర్ పద్మభూషన్ లాంటి మంచి సినిమాలని ప్రొడ్యూస్ చేసిన ఛాయ్ బిస్కెట్ నుంచి వస్తున్న ఈ మూవీని యుట్యూబ్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసాడు. ఈమధ్య కాలంలో చాలా బజ్ క్రియేట్ చేసిన ఒక చిన్న సినిమాగా మేమ్ ఫేమస్ నిలిచింది. ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసి పాజిటివ్ బజ్ జనరేట్ చెయ్యడంతో అల్లు అరవింద్ లాంటి పర్సన్ మేమ్ ఫేమస్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ముందుకొచ్చాడు.

మే 26న రిలీజ్ కానున్న ఈ సినిమాని స్పెషల్ షో చూసిన మహేష్ బాబు “Just watched #MemFamous! Brilliant film!! Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s– what a talent! The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of debutants made this film! Congratulations to @SharathWhat @anuragmayreddy and the young team for this film. Proud of you guys for backing this talent!” అంటూ ట్వీట్ చేసాడు. మహేష్ బాబు నుంచి కాంప్లిమెంట్స్ రావడంతో మేమ్ ఫేమస్ చిత్ర యూనిట్ అంతా క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఘట్టమనేని అభిమానులు కూడా మేమ్ ఫేమస్ సినిమాపై దృష్టి పెట్టారు. మహేష్ కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది, వీరందరూ తమ హీరోకి నచ్చిన సినిమాని ఒకసారి థియేటర్ లో చూస్తే చాలు మేమ్ ఫేమస్ సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ. తన ఒక్క ట్వీట్ తో మహేష్ బాబు ఒక చిన్న సినిమా జాతకాన్ని మార్చేశాడు. మరి మహేష్ మెచ్చిన మేమ్ ఫేమస్ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Show comments