సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాని నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ పర్యవేక్షణ, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఆ పని పూర్తిచేయనున్నారు. మరోవైపు మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. నవంబర్ వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మహేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్ సినిమా ప్రారంభించనున్నారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడంటే?
