Site icon NTV Telugu

Mahesh Babu: మహేశ్ బాబు న్యూ లుక్ చూసారా? క్లాస్ కటౌట్ తో మాస్ సినిమా లోడింగ్

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సారథి స్టుడియోలో వేసిన సెట్ లో SSMB 28 షూటింగ్ జరిగింది. త్రివిక్రమ్ అండ్ టీం కార్లని మైత్రివనం వరకూ కనిపించే రేంజులో ఎగరేసారు. సారథి స్టూడియో దగ్గరలో ఉన్న వాళ్లు త్రివిక్రమ్ ఎలాంటి మాస్ సినిమా చేస్తున్నాడు రా బాబు, కార్లు గాల్లోకి లేస్తున్నాయి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మహేశ్ బాబు హెడ్ స్కార్ఫ్ కట్టిన ఫోటో అండ్ వీడియో కూడా సెట్స్ నుంచి లీక్ అయ్యి ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. దీంతో మహేశ్ బాబుకి పోకిరి, శ్రీమంతుడు లాంటి హిట్ సినిమా లోడింగ్ అంటూ ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ షెడ్యూల్ కంప్లీత్ట్ అవ్వడంతో మహేశ్ బాబు స్పెయిన్ ని వెళ్లాడు.

నమ్రత, మహేశ్ బాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించారు. మహేశ్ స్టైలిష్ గా ఉన్న ఫోటోలు బయటకి వచ్చి ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. బ్లూ క్యాప్ పెట్టుకోని మహేశ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ ఫోటోస్ చూసిన వాళ్లు స్టైలిష్ హీరోతో త్రివిక్రమ్ మాస్ సినిమా చేస్తున్నాడు అంటున్నారు. ఇదిలా ఉంటే ఒక ఫ్యాన్ మాత్రం “మీరు ఎయిర్పోర్ట్ పక్కనే ఇళ్లు కట్టుకుంటే బాగుంటుంది సర్. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తున్నారు” అంటూ కామెంట్ చేశాడు. స్పెయిన్ నుంచి మహేశ్ బాబు తిరిగిరాగానే SSMB 28 కొత్త షెడ్యూల్ మళ్లీ స్టార్ట్ అవనుంది.

Mahesh Fan

Exit mobile version