Site icon NTV Telugu

పిక్ : సూపర్ కూల్ లుక్ లో సితారతో మహేష్

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబి28’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. పనితో పాటు ఈ హీరో ఫ్యామిలీతో అక్కడే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తరచుగా వారి కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి సూపర్ కూల్ లుక్ లో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు.

https://ntvtelugu.com/allu-arjun-thanks-samantha-for-trusting-him-and-doing-oo-antava-oo-antava-song/

ఈ పిక్ లో మహేష్, సితార కలిసి బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి దుస్తుల ఫ్యాషన్ ఆకట్టుకుంటోంది. నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పంచుకుంటూ ఒక బిటిఎస్ కథను కూడా రాసింది. “అసంఖ్యాకమైన పక్షులు, తేనెటీగలు వంటి అందమైన జీవుల మధ్య పచ్చిక బయళ్లలో వారి రుచికరమైన అల్పాహారం తినడానికి సిద్ధంగా ఉన్న ఈ ఇద్దరికి తెల్లవారుజామున ఎప్పుడూ పని ఉండదు. అవును .. రోజుకి సంబంధించిన ప్లాన్ ప్రతిరోజూ ఇక్కడే tjis టన్నెల్‌లో రూపొందుతుంది. ప్రతి ఉదయం ఒక తాజా గమనికతో తయారు అవుతుంది. సో ఈ రోజు నేను ఈ విజువల్ క్యాప్చర్‌ని తీయడానికి ముందుకు నడిచాను. కాబట్టి నేను కార్డ్‌లలోని మెనుని కోల్పోయాను !! కానీ అది ఆమెకు అప్పగించాలి. ఆమె అల్పాహారం ఉత్తమమైనది, తక్కువ సంక్లిష్టమైనది. నేను ఈ ఇద్దరి నుండి నేర్చుకోవడం ప్రారంభించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను” అంటూ తండ్రీ కూతుళ్ళ గురించి సుదీర్ఘమైన పోస్టును పంచుకుంది నమ్రత.

కాగా ‘ఎస్ఎస్ఎంబి28’ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధా కృష్ణ నిర్మించారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో అతడు (2005), ఖలేజా (2010) చిత్రాలలో కలిసి పని చేశారు. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Exit mobile version