టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఇళయదళపతి విజయ్ దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. మహేశ్ నటించిన పలు చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు విజయ్. ఈ ఇద్దరు హీరోల మధ్య కూడా చక్కటి అనుబంధం ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అంత సయోధ్య కనిపించటం లేదు. దానికి నిదర్శనం ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన ట్వీట్ వార్. నిజానికి ఈ తరహా ఫ్యాన్ వార్
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరగటం కొత్త కాదు. తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మహేశ్, విజయ్ అభిమానుల వంతు వచ్చింది. అయితే వీరి వార్ కి కారణం చూస్తే సిల్లీ అనిపించక మానదు.
Read Also : Mahesh Marriage Anniversary : ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్… పిక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్
విషయానికి వస్తే మహేష్ బాబు నటించిన ‘సర్కార్ వారి పాట’ మొదటి సింగిల్ ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. ఇక అదే రోజు విజయ్ ‘బీస్ట్’ సింగిల్ కూడా విడుదల కాబోతోంది. తమ తమ హీరోల పాటలను హ్యాపీగా ఆస్వాదించటానికి రెడీ అవ్వాల్చిన అభిమానులు ట్విట్టర్‌లో ఫైట్ మొదలెట్టారు. యూట్యూబ్‌లో ‘బీస్ట్’ ట్రాక్ లైక్స్ ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్ ను ఉపయోగిస్తారని మహేష్ ఫ్యాన్స్ ఆరోపించారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ మహేష్ అభిమానులు ఫౌల్ క్రై చేస్తున్నారంటూ దండయాత్ర మొదలు పెట్టారు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆ పై నెగిటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలెట్టారు. ఈ రెండు సినిమాల పాటలు విడుదల కావటానికి చాలా టైమ్ ఉన్నా వీరి ఫ్యాన్ వార్ మాత్రం తారాస్థాయిని చేరింది. హీరోలు తమతమ అభిమానులను దురభిమానం చూపించవద్దని కోరుతున్నా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి మహేశ్, విజయ్ సినిమాలలో పాటలు రిలీజ్ అయిన తర్వాత ఈ వార్ ఇంకెంతటి తీవ్రస్థాయికి చేరుతుందో చూడాలి.
