Site icon NTV Telugu

మహేష్, పవన్ కాంబినేషన్ సెట్ అవుతోందా ?

Mahesh and Pawan Kalyan to come together for SSM28?

టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా రాబోతోంది. మహేష్, పవన్ కాంబినేషన్ లో వెండి తెరపై బొమ్మ పడితే ఎలా ఉంటుంది ? రికార్డులన్నీ బద్దలు అయినపోవాల్సిందే. కానీ ప్రస్తుతానికి అది కలే… ఎందుకంటే పవన్, మహేష్ కలిసి రాబోతోంది సినిమా కోసమే. కానీ మల్టీస్టారర్ కాదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న “ఎస్ఎస్ఎంబి28” ప్రాజెక్ట్ కోసం. అది కూడా నిర్మాతగా… అంటే మహేష్ సినిమాకు పవన్ నిర్మాత అన్నమాట. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది.

Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” ఫస్ట్ డే కలెక్షన్స్

ఇక గతేడాది ‘అల వైకుంఠపురంలో’తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లపై దృష్టి పెట్టారు. అయితే ఆ జానర్‌తో పాటు సబ్జెక్ట్ ట్రీట్‌మెంట్ కూడా తప్పనిసరిగా విభిన్నంగా ఉండాలని మహేష్ చెప్పారట. “ఎస్ఎస్ఎంబి28” కూడా అలాగే తెరకెక్కనుంది. మరోవైపు మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 13న “సర్కారు వారి పాట” ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version