Varasudu: తమిళ స్టార్ హీరో విజయ్ తో వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఒకే సారి విడుదల చేస్తున్నారు. తమిళనాట అజిత్ సినిమా ‘తునివు’తో పోటీపడుతున్న ‘వారసుడు’ తెలుగులో చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’తో సై అంటున్నాడు. మహేశ్ బాబుతో ‘మహర్షి’ సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి నిజానికి ఈ సినిమాను కూడా మహేశ్ తోనే తీస్తాడని వినిపించింవది. అయితే ఎందుకో ఏమో మహేశ్ కు ఈ కథ నచ్చకపోవడమో లేక కమిట్ మెంట్స్ వల్లనో నో చెప్పాడట. ఆ తర్వాత దర్శకుడు విజయ్ దగ్గరకు తీసుకెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
Read also: Harish Rao: మెడికల్ హబ్ గా తెలంగాణ ఎదిగింది
అయితే విజయ్ కంటే ముందు దిల్ రాజు రామ్ చరణ్ కు కూడా వినిపించాడట. చరణ్ కు వంశీ కథ కంటే శంకర్ కథ నచ్చటంతో చివరకు అది విజయ్ వద్దకు వెళ్లిందట. మహేష్, చరణ్‌ల డేట్స్ వల్ల ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్ళిందని చెబుతున్నప్పటికీ వారిద్దరూ ఈ తరహా కథాంశంతో సినిమాలు చేసి ఉండటం వల్లే అంత ఆసక్తి చూపించలేదని అంటున్నారు. నిజానిజాలు ఏమిటన్నది దర్శకనిర్మాతలు వెల్లడించాల్సి ఉంది. ‘వారసుడు’ ప్రచారం ప్రారంభించిన తర్వాత అసలు విషయం ఏమిటన్నది వెలుగు చూస్తుందేమో చూద్దాం.
EMIs High-No Extension: రుణం.. భారం. రెపో రేటు పెంపు ఫలితం