Mahendragiri Varahi: అక్కినేని వారసుడు సుమంత్.. ఒక మంచి హిట్ అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. విజయాపజయాలను పక్కన పెట్టి.. అవకాశాలను అందుకుంటూ.. విజయం కోసం కాచుకొని కూర్చుంటున్నాడు. తాజాగా సుమంత్ నటిస్తున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో సుమంత్ సరసన మీనాక్షి గోసామి నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న మేకర్స్ .. తాజాగా ఈ సినిమా మొదటి గ్లింప్స్ ను డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
Anil Ravipudi: భగవంత్ కేసరి హిట్.. కాస్ట్లీ గిఫ్ట్ పట్టేసిన డైరెక్టర్
ఈ సందర్భంగా దర్శకులు క్రిష్ మాట్లాడుతూ… “మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది, అందరికి కనెక్ట్ అయ్యే కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లిమ్స్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నాను, చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నాను” అని చెప్పుకొచ్చాడు.
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపాడు. ఇప్పటికే సుమంత్ ఇలాంటి గుడి రహస్యాల చుట్టూ తిరిగే కథలలో నటించాడు. ఇక ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.