Site icon NTV Telugu

Mahavatar Narasimha : మహావతార్ నరసింహా మూవీపై చాగంటి ప్రశంసలు..

Chaganti Koteshwara Rao Praises Mahavatar Narasimha

Chaganti Koteshwara Rao Praises Mahavatar Narasimha

భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలై, మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియెన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు.

Also Read : Collie : 24 గంటల్లోనే ఊహించని టికెట్ బుకింగ్స్ – రికార్డులు తిరగరాసిన ‘కూలీ’

నిర్మాత అలు అరవింద్‌తో కలిసి సినిమా చూసిన ఆయన, థియేటర్‌లో అనుభవించిన భావోద్వేగాలను పంచుకున్నారు.. “భక్త ప్రహ్లాద వంటి చిత్రం ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచింది. అదే స్థాయిలో, బొమ్మలతో రూపొందించినప్పటికీ ‘మహావతార్ నరసింహా’లో నిజంగా నరసింహుడిని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది” అని తెలిపారు. ఈ రివ్యూ వీడియోను గీత ఆర్ట్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి షేర్ చేయడంతో, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాగంటి తో పాటు శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది మహావతార్ నరసింహా. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ ఇప్పటివరకు రూ.230 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ఇతర స్టార్ హీరోల సినిమాలు వచ్చినా తన క్రేజ్‌ను తగ్గించకుండానే కలెక్షన్లతో దూసుకుపోతోంది.

 

Exit mobile version