Site icon NTV Telugu

ఓటీటీలో శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో వీక్షించవచ్చు.

Read Also: షాకింగ్: ‘జబర్దస్త్’ నుంచి సుధీర్ అవుట్..?

సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ తెలుగు సినిమాలో నటించాడు. దీంతో ‘మహాసముద్రం’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

Exit mobile version