Guru Swamy: బ్రేకింగ్.. ‘మహర్షి’ రైతు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guru Swamy: సూపర్ స్టార్ మహేష్ బాబు- వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన చిత్రం మహర్షి. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో బిజినెస్ మ్యాన్ గా అమెరికా నుంచి వచ్చి ఒక పల్లెటూరిలో మహేష్ బాబు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. తన స్నేహితుడు కోసం అండగా నిలబడడానికి వచ్చిన మహేష్ కు ఒక ముసలి తాత జ్ఞానోపదేశం చేస్తాడు. వ్యవసాయం అంటే ఏంటో..? రైతు అంటే ఎవరో చెప్పి మహేష్ కళ్ళు తెరిపిస్తాడు. మహర్షి సినిమా చూసిన ప్రతిఒక్కరికి ముసలి రైతు పాత్ర కంటతడి పెట్టిస్తోంది. పదరా పదరా సాంగ్ లో మహేష్ కు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించి అందరి చేత ప్రశంసలు అందుకున్న ఆ నటుడు ఇప్పుడు లేరు. నేటి ఉదయం నటుడు గురు స్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వయో వృద్ధాప్యంతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందారు. గురుస్వామి సొంత ఊరు కర్నూల్. చిన్నతనం నుంచి ఎన్నో నాటకాల్లో నటించడమే కాకుండా తనలాంటి కళాకారులు బతకాలని విజేత ఆర్ట్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు గురుస్వామి. ఆలా నాటక రంగంలో ఆరితేరిన ఆయనకు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం లభించింది. ఇక మహర్షి సినిమాలో రైతు పాత్రకు విశేష ఆదరణ లభించింది. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ. సక్సెస్ మీట్ లోను ఆయన తన గాధను వివరించారు. ఇక గురుస్వామి మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!