Site icon NTV Telugu

Mahakali : మహాకాళి నుండి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

Mahankali

Mahankali

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత, తాజాగా తన కొత్త చిత్రం ‘మహాకళి’ని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, పూజా అపర్ణ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం PVC లో విభిన్న కథలతో అనేక చిత్రాలు రూపొందుతున్నాయి, ‘మహాకాళి’ కూడా అందులో భాగం అని చెప్పాలి. సినిమా కాన్సెప్ట్ ప్రకారం, హనుమంతుడి ధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపిణిగా మహాకాళి పాత్ర ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

Also Read : God: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ “గాడ్” – ట్విస్టులు అదుర్స్

అయితే ఈ కథలో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారం, మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలతో అనుసంధానం చేయబడింది. ఈ విధంగా ‘మహాకళి’ తెలుగు చిత్రసీమలో కొత్తదనానికి నిలువెత్తు ఉదాహరణగా మారే అవకాశం ఉందని, సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా మూవీ టీం ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసింది, దీనిలో “కాలపు నీడల నుంచి, మరచిపోయిన గురువు మేల్కొంటాడు” అని హైలైట్ చేశారు. అంతేగాక, రేపు ఉదయం 10 గంటలకు సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులకే కాకుండా, సినీ పరిశ్రమలో ‘మహాకాళి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రాబోయే సినిమా టిక్ అనుభవానికి ఉత్కంఠను పెంచుతోంది.

 

Exit mobile version