Kannappa : మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహాదేవ శాస్త్రి పాత్రలో కలెక్షన్ కింగ్ నటిస్తున్నారు. ఆయన పాత్ర గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేశారు. ఇందులో ఆయన నడుచుకుంటూ వస్తున్న టైమ్ లో అందరూ మోకాళ్లపై వంగి నమస్కరిస్తుంటారు. దానికి తగ్గట్టు ఆయన పాత్రను పరిచయం చేసే సాంగ్ ను రూపొందించారు.
read also : SSMB29 : మళ్లీ ఫొటో లీక్.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!
‘ఢమ ఢమ ఢమ ఢమ విస్పులింగ.. ధిమి ధిమి ధిమి ధిమి ఆత్మలింగ’ అంటూ సాగే పాట వైబ్రేషన్ తెప్పించేదిగా ఉంది. ఈ గ్లింప్స్ ను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేశారు. క్షణాల్లోనే ఈ గ్లింప్స్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఆయన అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మొదట్లో ఈ మూవీపై ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేస్తుండటంతో హైప్ బాగా పెరిగిపోయింది.