Site icon NTV Telugu

‘మహా సముద్రం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!

Maha Samudram Movie Censor Formalities Completed

సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’. అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్.ఎక్స్. 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. ముందు అనుకున్న విధంగానే దసరా కానుకగా ‘మహా సముద్రం’ మూవీ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Read Also : సమంత ఆవేదన

Exit mobile version