Madras Highcourt slams actor Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటి త్రిషపై అవమానకరమైన కామెంట్స్ చేసిన వివాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ‘ లియో’లో నటి త్రిషతో సన్నిహిత సన్నివేశం లేకపోవడం పట్ల మన్సూర్ అలీ ఖాన్ నిరాశ వ్యక్తం చేశారు, అతను చేసిన వ్యాఖ్యలు త్రిషకు కోపం తెప్పించగా పలువురు సినీ నటీనటులు కూడా అతనిని తప్పు పడుతూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వివాదం ముగిసేందుకు గాను మన్సూర్ అలీ ఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పాడు. అలా చెప్పినట్టే చెప్పి మళ్ళీ మన్సూర్ అలీ ఖాన్ తర్వాత త్రిషపై పరువు నష్టం కేసు వేసేందుకు కోర్టును ఆశ్రయించాడు. అంతేకాదు త్రిషకి మద్దతుగా నటుడి వ్యాఖ్యలను ఖండించినందుకు ఖుష్బు, చిరంజీవిలను కూడా తన ఫిర్యాదులో చేర్చాడు. ఈ ముగ్గురి నుండి పరిహారంగా ఇప్పించాలని డబ్బు కూడా కోరాడు.
Chiranjeevi: కేసీఆర్‌కు చిరంజీవి పరామర్శ.. చాలా సంతోషంగా అనిపించిందన్న చిరు!
ఈ కేసు మద్రాసు ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది, కేసును విచారించిన న్యాయమూర్తి, మన్సూర్ అలీ ఖాన్ ఫిర్యాదుపై విరుచుకుపడ్డారు. పబ్లిక్ ఫోరమ్‌లో ప్రముఖ నటిపై మన్సూర్ అలీఖాన్ అవమానకరంగా వ్యాఖ్యానించడాన్ని న్యాయమూర్తి ఖండించారు, బహిరంగంగా ఎలా ప్రవర్తించాలో అతనికి తెలియాలని అన్నారు. అంతేకాదు ఈ ఫిర్యాదుకు విరుద్ధంగా, అసలు ఫిర్యాదును త్రిష దాఖలు చేయాలని న్యాయమూర్తి భావించారు. ఈ నటుడు తరచూ వివాదాల్లో చిక్కుకుంటాడని న్యాయమూర్తి విమర్శించారు. నిర్దోషి అని పేర్కొన్నందుకు నటుడి మీద ఫైర్ అయ్యారు. మన్సూర్ అలీ ఖాన్ న్యాయవాది యూట్యూబ్ ఇంటర్వ్యూ అన్‌కట్ వీడియోను సమర్పించడానికి అంగీకరించారు, ఇక అంతేకాక నటుడిని ఖండిస్తూ త్రిష చేసిన పోస్ట్‌ను తొలగించమని ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీంతో న్యాయమూర్తి త్రిష, ఖుష్బు, చిరంజీవిలను తమ పక్షాన వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ, కేసును డిసెంబర్ 22కి వాయిదా వేశారు. అంతేకాక తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్న మన్సూర్ అలీఖాన్ బేషరతుగా క్షమాపణ ఎందుకు చెప్పారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇక త్రిష తరఫు న్యాయవాది బాధితురాలే మౌనంగా ఉంటే త్రిష మీదనే ఎందుకు కేసు పెడుతున్నారని ప్రశ్నించారు.
