Site icon NTV Telugu

Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి మాధురి ఔట్.. భరణిపై సంచలన కామెంట్

Madhuri

Madhuri

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ -9 నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వచ్చిన రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో షాక్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కల్యాణ్‌, తనూజ, రాము, డిమోన్‌ పవన్‌, గౌరవ్‌ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్, మాధురి మధ్య చివరి దాకా పోటా పోటీ వాతావరణం కనిపించింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

Read Also : Babloo : ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు డీజే ఆపరేటర్

ఇక వెళ్లిపోతున్న సమయంలో మాధురి సంచలన కామెంట్లు చేసింది. తాను బయటకు వస్తానని ముందే తెలుసని.. నవంబర్ 4న తన భర్త శ్రీనివాస్ బర్త్ డే కావడంతో ఆ టైమ్ లో ఆయన పక్కన ఉండటం తనకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇక హౌస్ లో ఉన్న వారందరి గురించి మాట్లాడింది. కల్యాణ్‌, డిమాన్ పవన్, తనూజ చాలా స్వీట్ పర్సన్స్ అని చెప్పిన మాధురి.. భరణికి హౌస్ లో ఉండే అర్హత లేదని చెప్పింది. అందరూ వెనక నుంచి పొడిస్తే.. అతను నేరుగానే పొడుస్తున్నాడంటూ సంచలన కామెంట్ చేసింది.

Read Also : Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్

Exit mobile version