Site icon NTV Telugu

Madhavi Latha: భగవంత్ కేసరిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని రియల్ లైఫ్ లో మాత్రం?

Balakrishna Madhavilatha

Balakrishna Madhavilatha

Madhavi Latha Sensational Comments on Bhagavanth Kesari Movie: ఈ మధ్య కాలంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఒక కీలక పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమాలో ప్రస్తావించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ అయితే బాగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఇక తాజాగా అదే అంశం మీద ఒకప్పటి హీరోయిన్ మాదవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. స్నేహితుడా, నచ్చావులే లాంటి సినిమాలతో హీరోయిన్ గా నిలదొక్కుకున్న మాధవి ఎందుకో తరువాత ఆ స్థాయిలో సినిమాలు చేయలేకపోయింది. సినిమాలు కూడా లేకపోవడంతో బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

Manchu Vishnu: రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా కన్నప్ప!

హీరోల చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం చాలా మంచి విషయం అని పేర్కొన్న ఆమె హీరోయిన్ పాత్రని గ్లామర్ కి పరిమితం చేసి హీరో చేత ఇలాంటి డైలాగులు చెప్పించకూడదు ఆ విషయంలో భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల పాత్ర చాలా బావుందని నేను విన్నానని ఆమె అన్నారు. అలా చేయకపోతే చేసేది శివ పూజ దూరేది ఇంకేదో అన్నట్లుగా ఉంటుందని మాధవీలత పేర్కొంది. అలాగే ఆమె మాట్లాడుతూ డైలాగులు చెప్పడం వరకే కాదు, ఆ డైలాగులు చెప్పే వారు రియల్ లైఫ్ లో కూడా పాటిస్తే మంచిది అంటూ మాధవీలత పేల్చిన ఒక సెటైర్ హాట్ టాపిక్ అవుతోంది. మళ్ళీ హరహర దేవా మళ్ళీ చేసేది శివపూజలు దూరేది ఇంకేదో అనిపించేలా ఉండకూడదని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె నేరుగా ఎవరినీ విమర్శించకపోయినా బాలకృష్ణను పరోక్షంగా విమర్శించినట్టు అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.

Exit mobile version