Shaitaan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సఖి, రన్, చెలి లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా మారిన మాధవన్.. ప్రయోగాత్మకమైన సినిమాలు, బయోపిక్స్.. విలనిజం ఇలా ఏదైనా సరే ఆయన ముందు ఉంటాడు. ఇక తాజాగా మాధవన్ నటించిన బాలీవుడ్ మూవీ సైతాన్. గత ఏడాది గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వష్ కి ఇది అధికారిక రీమేక్. అజయ్ దేవగన్, జ్యోతిక జంటగా నటించిన ఈ చిత్రంలో విలన్ గా మాధవన్ నటించాడు. విశాల్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 8 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో మాధవన్ వన్ మ్యాన్ షో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇక సైతాన్ కథ విషయానికొస్తే.. అజయ్ దేవగన్, జ్యోతిక భార్యాభర్తలు. వారికి టీనేజ్ కూతురు జంకీ బొదివాలా. ఆమె అంటే వారికి ప్రాణం. ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే ఈ చిన్న ఫ్యామిలీ.. కూతురు కాలేజ్ కు సెలవులు కావడంతో సొంత గ్రామానికి బయల్దేరతారు. మార్గమధ్యంలో వీరికి మాధవన్ పరిచయమవుతాడు. ఆ పరిచయంతో మాధవన్.. అజయ్ ఇంటికి వస్తాడు. కొద్దిసేపు మాట్లాడక కూడా మాధవన్ వెళ్లకుండా.. ఛార్జ్ అయిపోయిందని, ఇంకొంచెం సేపు అని ఇలా ఇంట్లోనే కాలం గడపడంతో అజయ్, జ్యోతిక భయపడతారు. ఇక ఈలోపే వారి కూతురును వశీకరణ విద్య ద్వారా వశపరుచుకొని.. ఆమె చేతనే తల్లిదండ్రులను టార్చర్ పెట్టిస్తాడు. అసలు ఎవరి మాంత్రికుడు..? ఎందుకు ఈ కుటుంబంపై పగబట్టాడు.. ? ఆ మాంత్రికుడు నుంచి కూతురును తల్లిదండ్రులు కాపాడుకున్నారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక మాధవన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సైతాన్ గా ఆయన నటన అద్భుతం. హిందీలో అయితే.. ఇది కొత్తగా అనిపిస్తుంది కానీ, తెలుగులో పొలిమేర, పిండం, విరూపాక్ష చూసినవారికి ఇది అంత ఎక్కదు అని చెప్పాలి. ఇక కథ గురించి పక్కన పెడితే.. మాధవన్ నటన మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి ఈ సినిమా తెలుగులో ఎప్పుడు వస్తుందో చూడాలి.
