R.Madhavan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇటీవలే రాకెట్రీ సినిమాతో విజయం అందుకున్న విషయం విదితమే. స్వయంగా మాధవన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను మాధవన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కోసం మాధవన్ తన ఇల్లును కూడా అమ్మేశాడని వార్తలు గుప్పుమంటున్నాయి. మొదట ఈ సినిమాకు వేరే డైరెక్టర్ ఉండగా.. కొన్ని కారణాల వలన అతను వెళ్లిపోయాడని, అందుకే మాధవన్ ఆ ప్లేస్ లోకి వచ్చాడని వార్తలను రాసుకొచ్చారు. సినిమాకు బడ్జెట్ సరిపోకపోవడంతో తన ఇల్లును కూడా అమ్మేసి సినిమాకు ఖర్చుపెట్టాడట. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని మాధవన్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ రూమర్స్ పై మాధవన్ స్పందిస్తూ “ఓరీ దేవుడా.. నేను ఏదో పెద్ద త్యాగం చేశాను అనుకోకండి.. నేను నా ఇల్లుతో పాటు దేన్నీ కోల్పోలేదు. నిజానికి రాకెట్రీలో పాల్గొన్న వారందరూ ఈ సంవత్సరం చాలా గర్వంగా భారీ ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేవుడి దయవలన మేమంతా చాలా లాభాలను ఆర్జించామని చెప్పడానికి గర్వపడుతున్నాను. నా ఇల్లును నేనెప్పుడూ ఐ ప్రేమిస్తూనే ఉంటాను.. ప్రస్తుతం ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లు అయ్యింది. ఇకపోతే ఈ సినిమా తరువాత మాధవన్ పలు కొత్త ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert
— Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022
