Madarasi Trailer : తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వస్తున్న లేెటస్ట్ మూవీ మదరాసి. అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా… తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు శివకార్తికేయన్. ఈ ట్రైలర్ నిండా యాక్షన్ సీన్లే కనిపిస్తున్నాయి. డైలాగులు, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ‘ఇది నా ఊరు సార్.. నేను వదలిపెట్టను’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Read Also : OG : ఓజీ నుంచి భారీ అప్డేట్.. మూడు రోజుల్లోనే..
శివకార్తికేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజు మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం అవుతోంది. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కాబోతోంది. ఇప్పటికే అనిరుధ్ అందించిన బీజీఎం ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవల్‌లో తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. శివకార్తికేయన్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు రాబోతున్న సినిమా తెలుగులో మంచి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Ghaati : అనుష్కకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది..?
