NTV Telugu Site icon

Nithiin : ‘మాచర్ల నియోజకవర్గం’ డేటు మారింది!

Macharla Niyojakavargam

Macharla Niyojakavargam

నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో తీవ్ర జాప్యం జరిగిన ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్టు గతంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఆగస్ట్ 12కు మారింది. మూవీకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌ రెడ్డి అనే ఐఎఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ రిలీజ్ డేట్ తో వెలువడిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని, హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్ గా కనిపించాడు. స్టైలిష్‌గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించాడు నితిన్.

 

ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలను ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. రాజకీయ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న’మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Show comments