Site icon NTV Telugu

Macherla Niyojakavargam First Attack : మాచర్ల మాస్ మొదలు.. యాక్షన్ ప్యాక్డ్ టీజర్

Macherla NIyojakavargam

Macherla Niyojakavargam First Attack మొదలైంది. ఇక మాచర్ల మాస్ స్టార్ట్… యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నితిన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం “మాచర్ల నియోజకవర్గం” టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. Macherla Niyojakavargam First Attack అంటూ విడుదల చేసిన ఈ టీజర్లోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

Read Also : NTR 30 : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన తారక్

టీజర్ చూస్తుంటే సినిమాలో ఏదో పండగ సమయంలో జరిగిన గొడవ అన్పిస్తోంది. ఇక ఈ పవర్ ప్యాక్డ్ టీజర్ లో నితిన్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తరువాత తమ అభిమాన హీరోని ఔట్ అండ్ అవుట్ మాస్ అవతార్‌లో చూడటం నితిన్ ఒక పండుగ అని చెప్పొచ్చు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో కథానాయికలుగా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా కనిపించనున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ట్ మూవీస్ Macherla Niyojakavargam చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 8న థియేటర్‌లలో విడుదల కానున్నది.

Exit mobile version