కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేశారు.
తెలుగులోనూ మంచి వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 24 న సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ సోనీ లివ్ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. “టైం లూప్‌లో చిక్కుకున్న అబ్దుల్ ఖాలిక్ విధి ఎలా ఉంది..? సోనీ లివ్ లో డిసెంబర్ 24న ప్రసారమయ్యే ‘మానాడు’ను రిపీట్‌లో చూడటానికి సిద్ధంగా ఉండండి” అంటూ పోస్ట్ చేశారు. మరి థియేటర్లో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీ ఎలాంటి రికార్డ్స్ సాధిస్తుందో చూడాలి.
